శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ వార్డు ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సతీష్ బాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్ల రక్షణ, సీసీటీవీ నిఘా మరియు బారికేడ్ల అమరికను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.
హిందూపురం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ సతీష్ బాబు..
