టాలీవుడ్లో విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ఓజీ’ చిత్ర దర్శకుడు సుజిత్‌తో నాని ఓ భారీ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘బ్లడీ రోమియో’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే టాలీవుడ్లో ఆసక్తి నెలకొంది. నాని కథల ఎంపిక, సుజిత్ తెరకెక్కించే విభిన్నమైన చిత్రాలపై ఉన్న అంచనాలు ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కీలక పాత్రల కోసం నటీనటులను ఎంపిక చేసే పనిలో చిత్రబృందం నిమగ్నమైందని సమాచారం. సినిమా కథ, నటీనటుల వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
