Latest Posts

విజయవాడ పోరంకిలో ‘మాక్సివిజన్ సూపర్‌స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్’ ప్రారంభం: ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర!

భారతదేశ వ్యాప్తంగా 90కి పైగా కేంద్రాలతో ప్రముఖ నేత్ర వైద్య సేవల నెట్‌వర్క్‌గా పేరొందిన ‘మాక్సివిజన్ సూపర్‌స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్’, విజయవాడలోని పోరంకిలో తమ సరికొత్త రెండవ శాఖను అత్యంత వైభవంగా ప్రారంభించింది. ఈ నూతన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గనులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, తాడిగడప మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకర్ రావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.

విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న అత్యాధునిక వైద్య అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఆసుపత్రిలో సమగ్ర కంటి సంరక్షణ సేవలను అందించనున్నారు. ముఖ్యంగా కాటరాక్ట్ (శుక్లాలు), గ్లాకోమా, రెటీనా సమస్యలు, రిఫ్రాక్టివ్ సర్జరీలు, చిన్నపిల్లల కంటి సమస్యలతో పాటు ఆధునిక రోగ నిర్ధారణ పరీక్షలు మరియు శస్త్రచికిత్సలను అనుభవజ్ఞులైన నిపుణులైన వైద్యుల బృందం పర్యవేక్షణలో అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ డాక్టర్ జి.ఎస్.కె. వేలు, చీఫ్ మెంటర్ డాక్టర్ కె.పి. రెడ్డి మాట్లాడుతూ.. నాణ్యమైన కంటి వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. 2003లోనే విజయవాడలో సేవలు ప్రారంభించి, ఏపీలోనే తొలిసారిగా ‘లాసిక్’ సాంకేతికతను అందించిన ఘనత మాక్సివిజన్‌కు ఉందని గుర్తుచేశారు. అత్యాధునిక వైద్య సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్యుల సేవలతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

Posted Under AP
Editor