ప్రజల వద్దకే వైద్య సేవలు
మంత్రి సత్య కుమార్ యాదవ్…ప్రజల వద్దకే వైద్య సేవలను తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు.
శనివారం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వారి నిధుల నుండి రూ. 75 లక్షల వ్యయంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన విశ్రాంతి భవనాన్ని ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొని లాంచనంగా ప్రారంభించారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ దలవాయి రమాదేవి, జిల్లా కలెక్టర్
ఓ .ఆనంద్ , ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఓలేటి రత్నమయ్య, కోనంకి గంగారాం, వెంకటరమణ, మిద్దెల నరసింహులు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.మల్లేశ్వరి, ఆర్ ఎం ఓ లు డా . సుధారాణి, డా. హేమలత, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. విజయశ్రీ,
ఏ .ఓ. మల్లికార్జున రెడ్డి, మాజీ మేయర్ స్వరూప ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు వైద్య సిబ్బంది, పలువురు కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సేవా తత్పరత భావంతో కృషిచేసి తన నిధుల నుండి విశ్రాంతి భవనాన్ని నిర్మించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాలో అన్ని ఆసుపత్రిలో అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. ముఖ్యంగా వివిధ హోదాల్లో ఖాళీగా ఉండే ఉద్యోగాలను భర్తీ చేయుటకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఆసుపత్రిలో అనేక ప్రాంతాల నుండి రోగులు వైద్య చికిత్సల కోసం వస్తుంటారని వారి సహాయకుల కోసం నిర్మించిన ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా 550 బెడ్లకు పైగా రోగులు వస్తుంటారని, ఇతర జిల్లాల కంటే అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రికి బెడ్లు పెంచవలసిన అవసరం ఉందన్నారు. ఆసుపత్రిలో వివిధ స్థాయిలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నాడు -నేడు కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులన్నీ అసంపూర్తిగా మిగిలిపోయాయని కేవలం కేవలం జీవోలు ఇచ్చారని స్పష్టత లేని కారణంగా వైద్య ఆరోగ్యశాఖలో అభివృద్ధి పనులు పూర్తి కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 756 కోట్ల రూపాయలను మౌలిక సదుపాయాల కల్పన కోసం సహకారం అందిస్తున్నదని అన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై ఐ వి ఆర్ ఎస్ సర్వేలో 78 శాతం వరకు ప్రజల నుండి స్పందన సత్ఫలితాలు ఇస్తున్నట్లు తెలిపారు.
అనంతపురంలో క్యాన్సర్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆసుపత్రుల్లో వైద్యులు ఇతర సిబ్బంది బాధ్యత యుతంగా తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడు లేని విధంగాప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల పట్ల ప్రజలకు విశ్వాసం కలుగుతున్నదని మారుమూల ప్రాంతాల్లో సైతం వైద్యులు తమ విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది జనాభాను తమ కుటుంబ సభ్యులతో సమానంగా జవాబుదారి తనంతో వైద్య శాఖ సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల అభివృద్ధికి ప్రజలు, దాతలు తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా సంజీవిని కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రజలకు 42 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందించడం జరుగుతున్నదని పేర్కొన్నారు. నిన్నటి రోజున ధర్మవరంలో అనంతపురం మరియు శ్రీ సత్య సాయి జిల్లాలకు సంబంధించి 71 ఆరోగ్య రకాలను ప్రారంభించడం జరిగిందని రూ. 3వేలు నుంచి
రూ 5వేలు వరకు ఖర్చయ్యే డయాబెటిస్, కిడ్నీ, కాలేయ, రక్త తదితర పరీక్షలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. అంతేగాక రాష్ట్రంలోని రెండువేల పైగా ఆసుపత్రులలో సమన్వయకర్తలను నియమించడం జరిగిందని రోగులకు వైద్య సేవ అందించడంలో భాగంగా ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలతో కలిసి ఆసుపత్రి వైద్యులు అపాయింట్మెంట్ మార్గ నిర్దేశం చేయడంతో పాటు చికిత్స అనంతరం మందుల వాడకం ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు. పరీక్షలు పూర్తయిన 48 గంటల్లోపు రిపోర్ట్‌లను ఫోన్ వాట్సాప్ కు పంపడం జరుగుతుందని ఆరోగ్య సమస్య గుర్తిస్తే రిపోర్టు ఇచ్చి వదిలేయకుండా అవసరమైన అవైద్య సేవలు అందించేలా తదుపరిచార్యులు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 933 ఆరోగ్య రథాలను ఏర్పాటు చేస్తున్నామని డిసెంబర్ 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ట్రయిల్ రన్ నిర్వహించి జనవరి 1 నుంచి ఆరోగ్య రథాలను సంజీవినితో అనుసంధానం చేసి పూర్తిస్థాయిలో అమలు చేస్తామని మంత్రి సత్య కుమార్ తెలిపారు.
మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం.
ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ…
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభా కార్యక్రమంలో తొలుత అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా మెరుగైన వైద్య సేవలు మరింతగా అందించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు వసతి ఏర్పాటుకు తన నిధుల నుండి రూ.75 లక్షల వ్యయంతో నిర్మించడం జరిగిందన్నారు. అనంతపురం ఆస్పత్రి అభివృద్ధికి అవసరమైన మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోది నేతృత్వంలో- 2047 వికసి భారత్ లక్ష్యాల్లో భాగంగా వైద్య రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులకు మాత్రమే కాకుండా చికిత్స కాలమంతా మానసిక మరియు లాజిస్టికల్ మద్దతును అందించే వారి సహాయకులకు కూడా సేవలు అందుతున్నట్లు తెలిపారు. తరచుగా ఈ సహాయకులకు సరైన ఆశ్రయం లేదా సౌకర్యాలు లేకుండా బహిరంగ ప్రదేశాలలో కారిడార్లలో లేదా ఆసుపత్రి ప్రాంగణంలో మరియు చుట్టుపక్కల వేచి ఉండాల్సిన దుస్థితిని ప్రజల ద్వారా గుర్తించి వారి అభ్యర్థన మేరకు ఈ సౌకర్యాన్ని కలిగించడం జరిగిందన్నారు. ముఖ్యంగా వర్షాకాలం వేసవి సమయాల్లో ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహాయకులు వేచి ఉండే సమయంలో లేదా విశ్రాంతి తీసుకునేటప్పుడు వారికి సురక్షితమైన పరిశుభ్రమైన మరియు క్రమబద్ధమైన వాతావరణాన్ని అందించడమే ఈ సౌకర్యం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. ఈ వసతి విశ్రాంతి భవనంలో మహిళలకు పురుషులకు వేరువేరుగా విభాగాలు ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. అంతే గాక ఇలాంటి సముదాయాలు ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ప్రతిబింబిస్తుందని ఎంపీ తెలిపారు. ఈ భవన నిర్మాణంలో భాగస్వాములైన దాతలకు ఎంపీ కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో రోగులకు సరిపడే విధంగా బెడ్లు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారాలతో ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి పరుస్తామన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అనేక ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్నట్లు పేర్కొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని ప్రభుత్వం ద్వారా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ అధిక శాతం మంజూరు అయిందని అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి అనేక విధాలుగా సహకరిస్తున్నట్లు ఎంపీ తెలిపారు.
ప్రస్తుతం ఈ ఆసుపత్రికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అన్ని పనులను, సమస్యలను పరిష్కరించాలని మంత్రి సత్య కుమార్ యాదవ్‌ను ఎంపీ ప్రత్యేకంగా కోరారు. అలాగే సి ఎస్ ఆర్ నిధులతో పాటు ఎంపీ లాడ్స్ ద్వారా ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
