- రాత్రి హామీ ఇచ్చారు ఉదయం పరిహారం చెక్కు అందించిన ఎమ్మెల్యే అమిలినేని
- గోడ కూలి మృతి చెందిన విద్యార్ధి కుటుంబానికి ప్రభుత్వం నుంచి 5,00,000 రూపాయల పరిహారం అందించిన ఎమ్మెల్యే అమిలినేని
- విద్యార్థి కుటుంబానికి అండగా ఉంటాం
- మరే విద్యార్ధికి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటాం
అనంతపురం జిల్లా శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి హర్షవర్ధన్ సమీపంలో ఉన్న పాత భవన వద్ద గోడ కూలీ మృతి చెందగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు ఆసుపత్రికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరమార్శించి వారికి ప్రభుత్వం నుంచి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు..అక్కడితో ఆగకుండా రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఉదయం కలెక్టర్ కార్యాలయం నుంచి విద్యార్థి కుటుంబానికి 5,00,00 రూపాయల పరిహారంగా చెక్కును పంపగా ఆర్డీఓ వసంత్ బాబుతో కలసి ఆసుపత్రికి వెళ్లి చెప్పిన మాట ప్రకారం కుటుంబ సభ్యులకు చెక్కును అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు..అంతే కాకుండా కుటుంబానికి అండగా ఉంటానని, ఇలాంటి సంఘటనలు మరెక్కడా జరగకుండా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు..
