ముదిగుబ్బ మండలం మలకవేమల క్రాస్ లో ఆదివారం నాడు పోలియో చుక్కల ప్రోగ్రామ్ ను డాక్టర్ నాగేంద్ర నాయక్ ప్రారంభించారు. పుట్టిన ప్రతి బిడ్డకి పోలియో చుక్కలు వేపించాలని, నిండు జీవితానికి పోలియో రెండు చుక్కల ద్వారా అంగవైకల్యం నుంచి విముక్తి పొందుతారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ప్రతి బిడ్డకు చుక్క వేపించాలి ఈ కార్యక్రమంలో, మలకవేమల తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి మల్లికార్జున, పెండ్లిమర్రి వెంకట శివయ్య, అంగనవాడి వర్కర్ పద్మావతి, ఆశా వర్కర్ జి. రాధమ్మ తదితరులు పాల్గొన్నారు…
మలకవేమల క్రాస్‌లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ నాగేంద్ర నాయక్
