అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం
శెట్టూరు మండలం లక్ష్మంపల్లిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి వైర్లు చోరీ
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం లక్ష్మంపల్లి గ్రామంలో ఓ రైతు వ్యవసాయ బావి వద్ద ఉన్న విద్యుత్ డీపీని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు రాత్రి వేళల్లో వైర్లు, విద్యుత్ సామగ్రిని అపహరించారు. వరుస చోరీలతో రైతులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్మంపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ బావి వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ డీపీకి సంబంధించిన వైర్లు, ఇతర విద్యుత్ పరికరాలను గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో చోరీ చేశారని తెలిపారు.
ఈ ఘటనతో తనకు వేల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల మండలంలో వరుస చోరీలు జరుగుతున్నప్పటికీ, వాటి నివారణపై పోలీసులు తగిన చర్యలు చేపట్టడం లేదని రైతులు, గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో దొంగల సంచారం పెరిగిపోవడంతో భయాందోళనకు గురవుతున్నామని, గ్రామాల్లో పోలీస్ పెట్రోలింగ్‌ను మరింత కట్టుదిట్టం చేసి చోరీలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
