ఎమ్మెల్యే అమిలినేని చొరవతో ముస్లిం స్మశానవాటికకు స్థలం..

  • ఎమ్మెల్యే అమిలినేని చొరవతో ముస్లిం స్మశానవాటికకు స్థలం
  • స్థలం కోసం ఎమ్మెల్యే అమిలినేని స్వంత నిధులు 1.50 లక్షలు అందజేత

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మౌక్తికాపురం గ్రామంలో రెండు దశాబ్దాలకు పైగా ముస్లింలకు స్మశానవాటిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి దృష్టికి విషయం వచ్చిన వెంటనే స్మశానవాటిక స్థలం కోసం చర్యలు చేపట్టారు..గ్రామంలో దాదాపు 150 ముస్లిం కుటుంబాలు ఉండగా స్మశానవాటిక ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో గ్రామ సమీపంలోనే ఉన్న పొలం రైతు దగ్గర మాట్లాడి సుమారు ఐదు ఎకరాల స్థలం ముస్లిం స్మశాన వాటిక కోసం అందజేయడం జరిగింది..నేడు గ్రామ ముస్లిం పెద్దలు, స్థానిక టీడీపీ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు తన స్వంత నిధులు 1.50 లక్షల రూపాయలు ముస్లిం మత పెద్దలకు అందజేశారు..

Posted Under AP
Editor