అనంతపురం జిల్లా కలెక్టరేట్
*జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి*
– *: కలెక్టర్ మరియు జిల్లా పర్యాటక కౌన్సిల్ చైర్మన్ ఓ.ఆనంద్*
అనంతపురము, జూన్ 15 :
– *జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ మరియు జిల్లా పర్యాటక కౌన్సిల్ చైర్మన్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పర్యాటక అభివృద్ధి కౌన్సిల్ సమావేశాన్ని జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ నిర్వహించారు.*
– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని ఎన్టీఆర్ పార్క్ దగ్గర బోటింగ్ మొదలుపెట్టాలన్నారు. అనంతపురం శిల్పారామంలో మాస్టర్ ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు చేయించాలని, అక్కడ చెక్ డ్యాంలో బోటింగ్, ఫుడ్ కోర్ట్ లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని సైన్స్ సెంటర్, ఆర్కియాలజీ మ్యూజియం, శిల్పారామంలను రోజు రెండు మూడు పాఠశాలల విద్యార్థులు విజిట్ చేసేలా చూడాలని, సైన్స్ సెంటర్ లో సిఎస్ఆర్ నిధుల కింద సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయించాలని డిప్యూటీ డిఈఓకి సూచించారు. జిల్లాలో కొన్ని చారిత్రక ప్రాంతాలు, కట్టడాల గురించి ఆర్కియాలజీ శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రాచీన ప్రదేశాలలోని కోనేరులను ఆధునికరించి ప్రచారం కల్పించాలన్నారు. కుందుర్పి కోటను అభివృద్ధి చేయాలన్నారు. పర్యాటక హోటల్ లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గుత్తి కోటను అభివృద్ధి చేయాలని, కోటకు మెట్లు, గోకార్టింగ్ ఏర్పాటు చేయాలని, రోప్ వేను ఏర్పాటు చేయించాలని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలన్నారు. బుక్కరాయసముద్రం మండలం కొండమీదరాయుని దేవాలయం గిరి ప్రదక్షిణ కోసం రహదారిని ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో అన్ని దేవాలయాల్లో, పర్యాటక ప్రాంతాల్లో అవసరమైన మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి పుష్కల అవకాశాలు ఉన్నాయని, దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.*
– *ఈ సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి ఓబులమ్మ, డ్వామా పిడి సలీం భాష, ఆర్కియాలజీ ఏడి స్వామి నాయక్, నగర పాలక సంస్థ కమిషనర్ జస్వంత్ రావు, నగర పాలక సంస్థ ఎస్ఈ రాజశేఖర్, పీఆర్ ఎస్ఈ సుబ్బారాయుడు, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ కె.శ్రీనివాసులు, మెప్మా పిడి విశ్వజ్యోతి, ఎండోమెంట్ ఏసి మల్లికార్జున ప్రసాద్, మైన్స్ డిడి ఆదినారాయణ, డిప్యూటీ డిఈఓ శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు నాగేశ్వర రెడ్డి, టూరిజం మేనేజర్ దీపక్, శిల్పారామం ఏఓ శివప్రసాద్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.*
