తాడిమర్రి (yes9tv )తాడిమర్రిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో “వెన్నుపోటు దినం” నిరసన ర్యాలీ
తాడిమర్రి, జూన్ 4: వైఎస్సార్సీపీ పార్టీ అధినేత వై . స్ . జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి ఆదేశాలనుసారం తాడిమర్రి మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన “వెన్నుపోటు దినం” పురస్కరించుకుని భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, సంక్షేమ పథకాల అమలులో జాప్యం, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు.
తాడిమర్రి ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేస్తూ ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రైతు మరియు పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్ రెడ్డి, వైఎస్సార్సీపీ స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ తాడిమర్రి మనోజ్ కుమార్ రెడ్డి, మండల నాయకులు అశ్వత్, భాస్కర్ రెడ్డి, రామాపురం మాజీ సర్పంచ్ కుంటాల పుల్లయ్య, మండల కన్వీనర్ ఆరవేటి రామాంజనేయులు, చింతకాయల రెడ్డప్ప, శివానందరెడ్డి, బీటెక్ నాగార్జున, రాజమోహన్, మదమంచి నాగేంద్ర, చిల్లవారిపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలాగే మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై ర్యాలీని విజయవంతం చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
తాడిమర్రిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో “వెన్నుపోటు దినం” నిరసన ర్యాలీ
