కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా సీఎం చంద్రబాబు.
ఒక్కో కుటుంబానికి రూ.1.50లక్షల చొప్పున సాయం.
ఎమ్మెల్యే పరిటాల సునీత చొరవతో సాయం
బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సునీత.
అనంతపురం. మే 05
కష్టాల్లో ఉన్న కుటుంబాల విషయంలో మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో అకాల మరణం పొందిన రెండు కుటుంబాలకు ఎమ్మెల్యే పరిటాల సునీత చొరవతో సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించారు. ఆత్మకూరు మండలం పంపనూరు తండాకు చెందిన వడిత్యా సురేష్ నాయక్ ఇటీవల విద్యుత్ షాక్ తో మరణించారు. దీంతో సురేష్ నాయక్ కుటుంబంలో తీర విషాదం అలుముకుంది. అలాగే అనంతపురం రూరల్ మండలం, రాచానపల్లి పంచాయతీకి చెందిన కరిటికొండ లింగమయ్య ప్రమాదవశాత్తు వాగులో పడి మరణించారు. కుటుంబ పెద్దలు ఇలా అకాల మరణం చెందిన విషయాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీతకు స్థానిక నాయకుల ద్వారా తెలియజేశారు. వెంటనే ఆమె స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన ఎంతో మానవతా దృక్పథంతో ఒక్కో కుటుంబానికి ఒకటిన్నర లక్షల రూపాయల చొప్పున సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించారు.మంగళవారం ఎమ్మెల్యే సునీత అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో సురేష్ నాయక్ సతీమణి సాయి లక్ష్మి, లింగమయ్య సతీమణి కరిటికొండ ధనలక్ష్మిలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. సీఎం చంద్రబాబు ఎంతో మంచి హృదయంతో ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత తెలిపారు. ఈ సాయం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్నా.. ఆ కుటుంబాలకు నా తరఫున.. పార్టీ తరఫున అండగా ఉంటామని ఎమ్మెల్యే సునీత స్పష్టం చేశారు.
కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా సీఎం చంద్రబాబు…
