తాడిమర్రి(yes9tv)తాడిమర్రి మండలం నార్సింపల్లి జేవిఎంఆర్డిటి ట్రస్ట్ స్కూల్‌లో పదో తరగతి ఫలితాల్లో ప్రతిభావంతుల రాణింపు
తాడిమరి మండలంలోని నార్సింపల్లి గ్రామంలో ఉన్న జేవిఎంఆర్డిటి ట్రస్ట్ స్కూల్ విద్యార్థులు ఈ సంవత్సరం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలు సాధించారు. తాజా ఫలితాల్లో పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారు.
ముత్తులూరి తనుజ (హాల్ టికెట్ నం: 2626123927) 600 మార్కులకు గాను 573 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించింది. ఆమె తల్లిదండ్రులు ముత్తులూరి వెంకట రమణ మరియు సరళ.
వలిపి అలేఖ్య (హాల్ టికెట్ నం: 2626123919) 600 మార్కులకు గాను 572 మార్కులు సాధించి మెరుగైన ఫలితాన్ని నమోదు చేసింది. ఆమె తల్లిదండ్రులు వి. సాంబ శివుడు మరియు లీలావతి.
సరిపుటి లిఖిత్ (హాల్ టికెట్ నం: 2626123941) 600 మార్కులకు గాను 565 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడు. ఆయన తల్లిదండ్రులు ఎస్. బాలాజీ మరియు అమ్మినేని భారతి.
ఈ విద్యార్థుల విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
తాడిమర్రి మండలం నార్సింపల్లి జేవిఎంఆర్డిటి ట్రస్ట్ స్కూల్‌లో పదో తరగతి ఫలితాల్లో ప్రతిభావంతుల రాణింపు
