2021 వ సంవత్సరంలో ముదిగుబ్బ మండల తహశీల్దార్ గా పని చేసిన అన్వర్ హుస్సేన్ గారికి ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి తాను ACB సిఐ ని అని పరిచయం చేసుకుని, ముదిగుబ్బ తహశీల్దార్ కార్యాలయంలో ACB రైడ్ జరగకూడదంటే డబ్బులు ఇవ్వాలని అప్పటి తహశీల్దార్ అన్వర్ హుస్సేన్ గారిని బెదిరించి వారి నుండి విడతల వారీగా డబ్బులు వసూలు చేయడం జరిగినది. ఈ విషయంలో అన్వర్ హుస్సేన్ గారు తనను ACB అధికారి పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసింది నిజమైన ACB అధికారి కాదని గుర్తించి, సదరు అజ్ఞాత వ్యక్తి అనంతపురము జిల్లా, కుడేరు మండలం, కలగల్లు గ్రామానికి చెందిన ఎరికల హనుమంతు, S/o చిన్న ఆంజనేయులు అని తెలుసుకుని ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా ఈ విషయంలో ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ Cr.No.18/2023 U/sec 419, 420 IPC మరియు Sec 66(D) I.T Act కేసు నమోదు చేయడమైనది. సదరు కేసులో తప్పించుకుని తిరుగుతున్న ముద్దాయి ఎరికల హనుమంతు ను నేడు ముదిగుబ్బ C.I, శివరాముడు గారు అరెస్ట్ చేయడమైనది.
ఈ సందర్భంగా సీఐ గారు మాట్లాడుతూ ప్రజలు గానీ, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎవరికైనా అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి ACB అధికారులమని చెప్పి బెదిరించి డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇలాంటి ఫేక్ ఫోన్ కాల్స్ కి స్పందించవద్దని తెలిపారు.
