Latest Posts

శ్రీ సత్యసాయి జిల్లాలో పలు కేసుల్లో నిందితుడి అరెస్ట్: నల్లమాడలో వినోద్ కుమార్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం
నల్లమాడ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 22/2026 U/s 331(3),305(a) కేసులో ముద్దాయి అయిన మల్లెల వినోద్ కుమార్ అలివస్ కర్ల వయస్సు 26 సం, S/o మల్లెల రామకృష్ణ చౌటుకుంటపల్లి గ్రామం ప్రస్తుతం నల్లమాడ గంగా హాల్ రోడ్డు వీధి లో నివాసం ఉంటున్నాడు. ఈ రోజు అనగా 26.03.2026 మద్యాహ్నం 12 గం లకు నల్లమాడ YSR సర్కిల్ నందు నల్లమాడ SI సతీష్ గారు అరెస్ట్ చేసి రిమాండు కు తరలించినారని నల్లమాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ V.శ్రీనివాసులు గారు తెలియజేయదమైనది. ఇతని పై శ్రీ సత్యసాయి జిల్లా నందు పలు పోలీస్ స్టేషన్స్ యందు పలు కేసులు నమోదు చేయబడ్డాయి. నేరాస్తున్ని పట్టుకోవడం లో కృషి చేసిన నల్లమాడ పోలీస్ సిబ్బంది కి నల్లమాడ CI గారు అభినందించారు.

Posted Under AP
Editor