నేపాల్‌లోనే ఎక్కువ విమాన ప్రమాదాలు.. కారణం తెలుసా?

నేపాల్‌.. హిమాలయ పర్వత శ్రేణుల్లోల ఉన్న చిన్న దేశం.. కేవలం మూడు కోట్ల జనాభా ఉన్న నేపాల్‌లో ఒకే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

అయితే ఆధ్యాత్మిక నియమైన నేపాల్‌ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. దీంతో విదేశీయులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇక్కడికి రావడానికి విమానాలే వారికి వాహనం. అయితే ప్రపంచంలో ఏ దేశంలో జరుగనన్ని విమాన ప్రమాదాలు నేపాల్‌ దేశంలోనే జరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో కొన్ని దేశాలు నేపాల్‌ ప్రయాణాన్ని నిషేధించాయి. తాజాగా నేపాల్‌కు చెందిన ఏటీఆర్‌ 72 విమానం నేపాల్‌లోని ఖడ్మండు నుంచి ఫోక్రాకు బయల్దేరింది. హిమాలయ పర్వతాల మీదుగా వెళ్లాలి. 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఇందులో ఉన్నారు. ఉదయం 11 గంటలకు విమానం ల్యాండ్‌ కావాల్సి ఉండగా, సముద్రంలో కూలిపోయింది. సాంకేతిక లోపంతో కూలిపోయిందన్న వార్త వచ్చింది. ప్రతికూల ప్రభావం అనడానికి వీలు లేదు. ఎందుకంటే ల్యాండింగ్‌కు కొద్దిసేపు ముందు మాట్లాడారు కూడా. ఈ విమాన ప్రమాదంలో భారతీయులు ఆరుగురు మృతిచెందారు. నలుగురి ఆచూకీ లేదు.

30 ఏళ్లలో 28 ప్రమాదాలు..
నేపాల్‌లో విమాన ప్రమాదాలు కొత్తేమీ కాదు గత 30 ఏళ్లలో 28 విమాన ప్రమాదాలు జరిగాయి. అనుభవం లేని పైలెట్లు. మంచు పర్వతాలు, ప్రతికూల వాతావరణం. విమాన ప్రమాదాలు, అందులోనూ ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ప్రమాదాలు నేపాల్‌ లోనే జరుగుతున్నాయి. ఇవే నేపాల్‌కు చెడ్డపేరు తెచ్చాయి. అందుకే నేపాల్‌ విమానాలపై యూరోపియన్‌ యూనియన్‌ 2013లో ఆంక్షలు విధించింది. నేపాల్‌ విమానాలను తమ గగనతలంపై నిషేధించింది.

నేపాల్‌ కి ఉన్న శాపం ఏంటి.. ?
నేపాల్‌ లో జరిగే విమాన ప్రమాదాలకు చాలా కారణాలున్నాయి. ప్రకృతి ప్రకోపం అందులో ప్రధానమైనది. ఎప్పుడెలా ఉంటుందో తెలియని వాతావరణ పరిస్థితి నేపాల్‌లో ఉంటుంది. అక్కడ వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటాయి. అంతా బాగుంది అంటూ ఎయిర్‌ ట్రాఫిక్‌ విభాగం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా, మధ్యలో ఏదో ఒక చోట హఠాత్తుగా వాతావరణం మారిపోతుంది. అందుకే నేపాల్‌లో విమానం టేకాఫ్‌ అయిన దగ్గర్నుంచి, ల్యాండింగ్‌ అయ్యే వరకు అందరూ టెన్షన్‌.. టెన్షన్‌గా ఉంటారు. వీటన్నింటికీ ప్రధాన కారణం హిమాలయాలు. ఈ మహా పర్వత సానువుల వల్ల విమాన ప్రయాణాలకు ఆటంకాలు ఎదురవుతుంటాయి. గతేడాది మేలో జరిగిన ప్రమాదంలో మొత్తం 22మంది చనిపోగా, ఈ ఏడాది తాజాగా జరిగిన ప్రమాదం, మరింత ఘోరం. అసలు నేపాల్‌ విమానాలంటేనే ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారిపోయాయి.

అక్కడ ఫ్లైట్‌ నడపడం చాలా కష్టం..
నేపాల్‌లో ఫ్టైట్‌ నడపడం చాలా కష్టమని నేపాల్‌ ఏవియేషన్‌ అధికారులు చెబుతారు. అక్కడి నిబంధనల ప్రకారం వంద గంటలు ఫ్లైట్‌ నడిపిన కో పైలెట్‌కు పైలెట్‌గా ప్రమోషన్‌ ఇస్తారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో కోపైలెట్‌ విమానం నడుపుతున్నట్లు తెలిసింది. 30 ఏళ్ల అనుభవం ఉన్న పైలెట్‌ పక్కనే ఉన్న ల్యాండింగ్‌ సమయంలో క్రాష్‌ అయింది. అక్కడి రన్‌వే ఎత్తయిన పర్వాతలకు సమీపంలో ఉండడం, వాతారణ పరిస్థితులు కూడా ఇందుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు. నేపాల్‌ విమానయాన సంస్థల్లో పనిచేసే పైలట్లు అరకొర శిక్షణతో క్యాబిన్‌లో కూర్చుంటున్నారనే ఆరోపణలున్నాయి.

Editor