Latest Posts

ఖాళీ కడుపుతో బ్లాక్ టీ తాగుతున్నారా.. అయితే ఈ ప్రమాదకరమైన వ్యాధులు తప్పవు..!

 చాలామంది బెడ్ మీద ఉండగానే టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. ఈ టీ కాఫీలు తాగకుండా ఏ పని మొదలుపెట్టరు. అయితే చాలామంది రకరకాల టీలను తాగుతూ ఉంటారు.

కొందరు బ్లాక్ టీ తాగుతూ ఉంటారు. ఉదయం బ్లాక్ టీ తాగితే కొన్ని సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
బ్లాక్ టీ తాగడం మంచిది కాదు అని కూడా చెప్తున్నారు. ఎందుకనగా బ్లాక్ టీ తాగితే ఎన్నో వ్యాధులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖాళీ కడుపుతో బ్లాక్ టీ తాగడం వలన ఈ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Black Tea : కడుపుబ్బరం

బ్లాక్ టీ తాగడం వలన గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. ఇది క్రమేపి వాత సమస్యను కలిగిస్తూ ఉంటుంది. దాని ఆమ్ల ప్రభావం మూలంగా ఎన్నో అనారోగ్యం సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Black Tea : మలబద్ధకం

శరీరంలో డీహైడ్రేషన్ ఉన్నప్పుడు మలబద్ధకం కూడా వస్తుంది. తిన్న ఆహారం పేగులలో సరిగా జీర్ణం అవ్వకపోతే మలవిసర్జన ప్రక్రియలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి.
బ్లాక్ టీ అమ్లత్వం కలిగి ఉంటుంది. కావున ఖాళీ కడుపుతో త్రాగడం వలన ఆమ్ల ప్రభావం పెరుగుతుంది. ఇది దంతాల ఉపరితల ఎనామిల్ను దెబ్బతీస్తూ ఉంటుంది.

YES9 TV