ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక హంగులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన కొత్త సూపర్ లగ్జరీ బస్సులను హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై శనివారం ఘనంగా ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ఈ కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించారు. అంతకంటే ముందుగా కొత్తగా ఆర్టీసీలోకి ప్రవేశపెడుతున్న సూపర్ లగ్జరీ బస్సులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్‌పై సందడి వాతావరణం నెలకొంది.
. సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్‌పై సందడి వాతావరణం
