Latest Posts

అందుబాటులోకి స్పెషల్ ట్రైన్లు.. పూర్తి వివరాలు ఇవే..

సంక్రాంతి పండుగకు వేలాది మంది సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. పండుగ సమయానికి బస్సులు, ట్రైన్లు, ప్రైవేట్ వాహనాలు భారీగా రద్దీతో నిండిపోనున్నాయి. ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండడంతో దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లను నడుతున్నట్లు ప్రకటించింది. ఈ సంక్రాంతికి 14 స్పెషల్ ట్రైన్స్‌ను వివిధ రూట్స్‌లో నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రయాణించనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పెషల్ ట్రైన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ట్విట్టర్‌లో వెల్లడించారు. మచిలీపట్నం-కర్నూల్, మచిలీపట్నం-తిరుపతి, విజయవాడ-నాగర్‌సోల్, కాకినాడ-లింగంపల్లి, అకోలా-పూర్ణ పట్టణాల మధ్య స్పెషల్ ట్రైన్స్ నడుతుపున్నట్లు తెలిపారు.

మచిలీపట్నం నుంచి కర్నూలు సిటీ (ట్రైన్ నెంబర్.07067) జనవరి 3,5,7,10,12,14,17వ తేదీలలో అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా కర్నూలు సిటీ నుంచి మచిలీపట్నం (ట్రైన్ నెం.07068) 4,6,8,11,13,15,18వ తేదీలలో నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. మచిలీపట్నం నుంచి తిరుపతి (ట్రైన్ నెం.07095) 1,2,4,6,8,9,11,13,15,16వ తేదీలలో రైలు నడుపుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా తిరుపతి నుంచి మచిలీపట్నం (రైలు నెం.07096) 2,23,5,7,9,10,12,14,16,17వ తేదీలలో స్పెషల్ ట్రైన్ రన్ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి నాగర్‌సోల్ (ట్రైన్ నెం.07698) 6,13వ తేదీలలో, నాగర్‌సోల్ నుంచి విజయవాడ (07699) 7,14వ తేదీలలో రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించారు. కాకినాడ నుంచి లింగంపల్లి (07445) వరకు 2,4,6,9,11,13,16,18వ తేదీలలో.. లింగంపల్లి నుంచి కాకినాడ (07446)కు 3,5,7,10,12,14,17,19వ తేదీలలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు చెప్పారు.

Editor