బంగ్లాదేశ్‌తో జరగబోయే తొలి టెస్ట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో స్టాండిన్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తున్న విషయం తెలుసు కదా. అయితే ఈ మ్యాచ్‌కు చెతేశ్వర్ పుజారాను వైస్ కెప్టెన్‌గా నియమించారు. నిజానికి టీమిండియా చివరిసారి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ఉన్నాడు. ఈసారి అతన్ని కాదని పుజారాకు ఈ బాధ్యతలు అప్పగించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. చివరికి స్టాండిన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నార తనకు తెలియదని అనడం విశేషం. తాజాగా మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ కూడా ఈ నిర్ణయం తనను షాక్‌కు గురి చేసిందని అన్నాడు.
“ఇది నన్ను షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే చివరిసారి ఇండియా ఆడినప్పుడు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు” అని ఈ అంశంపై హిందుస్థాన్ టైమ్స్ ప్రశ్నించినప్పుడు కైఫ్ అన్నాడు. ఒకవేళ పుజారాను వైస్ కెప్టెన్సీ ఇవ్వాలనుకుంటే అది అప్పుడు ఇంగ్లండ్‌లో బుమ్రాకు డిప్యూటీగా ఉంచాల్సింది అని కూడా కైఫ్ అభిప్రాయపడ్డాడు. “పుజారా అప్పుడు ఇంగ్లండ్‌తో ఆడిన టీమ్‌లో ఉన్నాడు. ఆ లెక్కన మీరు ఇప్పుడైనా పొరపాటు చేసి ఉండాలి లేదంటే అప్పుడైనా చేసి ఉండాలి. ఎవరో పొరపాటైతే చేశారు. ఎందుకు తొందరపడుతున్నారు? పంత్‌ను కెప్టెన్‌గా చేసేందుకు ఎందుకు తొందరపడుతున్నారు? అతడు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
అతడు కొన్ని మ్యాచ్‌లను గెలిపించాడని నాకు తెలుసు కానీ అతడు ఇంకా యువకుడే. ఇంత త్వరగా ఎవరినీ కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ చేయలేరు. ఎందుకీ తొందర? నాకు అర్థం కాదు. ఎవరైనా ఎందుకు నిలకడగా ఆడుతూ, మ్యాచ్‌లను గెలిపించకూడదు? టీమ్‌ను గెలిపించడమే ప్రాధాన్యత కావాలి కానీ కెప్టెన్సీ కాదు. మనం ప్లేయర్స్‌పై ఎక్కువ దృష్టి సారిస్తాం” అని కైఫ్ కాస్త ఘాటుగానే స్పందించాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం (డిసెంబర్ 14) నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు మహ్మద్ షమి, రవీంద్ర జడేజా కూడా దూరమయ్యారు. వీళ్ల స్థానంలో అభిమన్యు ఈశ్వరన్, నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, జైదేవ్ ఉనద్కట్‌లను ఎంపిక చేశారు.
