Latest Posts

ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను కించపరిచిన జ్యూరీ మెంబర్..

ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను నార్త్ ఆడియెన్స్‌ను నెత్తిన పెట్టేసుకున్నారు. కాశ్మీర్‌లో హిందువుల మీద జరిగిన హత్యాకాండను కళ్లకు కట్టినట్టు చూపించారని బాధితులు థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలెన్నో జరిగాయి. కాశ్మీర్ పండితులు అనుభవించిన వాటిని చూపించారంటూ నార్త్ ఆడియెన్స్‌ సినిమా మీద కలెక్షన్ల వర్షం కురిపించారు. అయితే ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని కొందరు ఈ సినిమాను వ్యతిరేకించారు. అయినా బాక్సాఫీస్ మీద మాత్రం ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఇలాంటి సినిమా మీద ఇజ్రాయల్ ఫిల్మ్ మేకర్ నాదవ్ లాపిడ్ అనే వ్యక్తి దారుణమైన కామెంట్లు చేశాడు. అది కూడా గోవాలో జరుగుతున్న 53వ ఫిల్మ్ ఫెస్టివల్లో అనేశాడు. ది కాశ్మీర్ ఫైల్స్ అనేది ప్రాపగాండ, పర్సనల్ ఒపీనియన్, వల్గర్‌ అన్నట్టుగా చిత్రీకరించేశాడు.

దీనిపై ఇజ్రాయెల్ వెంటనే స్పందించింది. ఇంజ్రాయెల్ అంబాసిడర్‌ నాఓర్ గిలాన్ స్పందిస్తూ.. నాదవ్‌ను తిట్టేశాడు. ఆయన తరుపున, ఇజ్రాయెల్ తరుపున మేం ఇండియాకు సారీ చెబుతున్నామని చెప్పుకొచ్చాడు. ఇండియా, ఇజ్రాయెల్ మధ్య మంచి సంబంధాలున్నాయి.. అవి అలానే కొనసాగాలి.. ఇండియా ఎప్పుడూ కూడా తన అతిథులను దేవుళ్లుగా భావిస్తుంది.. నిన్ను ఎంతో నమ్మకంతో వారు గెస్టుగా పిలిస్తే వారినే అవమానిస్తావా?.. నిన్ను గౌరవిస్తే నువ్ చేసేది ఇదేనా?.. అవార్డ్ ఫంక్షన్‌లో నువ్ అలా ఎందుకు మాట్లాడావో నాకు అర్థం కావడం లేదు.. మేం స్టేజ్ మీద ఆల్రెడీ చెప్పాం.. ఇండియా, ఇజ్రాయెల్ కామన్ ఎనిమీతో పోరాడుతోందని చెప్పాం.. కానీ నువ్వేమో ఇలా మాట్లాడేశావ్.. నువ్ ఇలా గొప్పగా మాట్లాడేసి ఇజ్రాయెల్‌కు వెళ్లిపోతావ్.. కానీ మేం ఇక్కడే ఉంటాం.. ఇజ్రాయెల్‌కు ప్రతీకగా ఇక్కడే ఉంటాం.. స్నేహాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశావ్.. నిన్ను చూస్తుంటే సిగ్గుగా ఉంది.. అందరికీ క్షమాపణలు చెబుతున్నానంటూ సుధీర్ఘ ట్వీట్లు వేశాడు.

Editor