Latest Posts

సీఈఓ ఎలాన్ మాస్క్ కీలక ప్రకటన.. ఇకపై ట్విట్టర్‌లో లే ఆఫ్స్​ ఉండవు..

ప్రపంచ కుబేరుడు ఎలాన్​ మస్క్ (Elon Musk)​ సంచలన నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ట్విట్టర్‌ను (Twitter) హస్తగతం చేసుకున్న తర్వాత అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. పనితనం సరిగ్గా లేని ఉద్యోగులను లే ఆఫ్స్ (Layoffs)​ పేరుతో ఇంటికి సాగనంపడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో ఉద్యోగుల నుంచి భారీ నిరసన ఎదురైంది. కొంతమంది ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్దపడ్డారు. దీంతో మొదటికే మోసం వస్తుందని గ్రహించిన మస్క్​.. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను విరమించుకున్నాడు. ఇక మీదట తాను ఉద్యోగులను తొలగించబోనంటూ ఎలాన్​ మస్క్​ ప్రకటించాడు. మస్క్‌ తాజా ప్రకటన వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ ఉన్నవారికి ప్రాధాన్యం ఉద్యోగుల తొలగింపు ఉండదని, కొత్తగా ఇంజినీర్లు, సేల్స్​ విభాగంలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు మస్క్‌​ చెప్పాడు. సాఫ్ట్‌వేర్‌ ​ప్రోగ్రామ్స్‌ కోడ్‌ను ​గొప్పగా రాసే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని తెలిపాడు. రిఫరల్స్​ ఉంటే చెప్పాలని మస్క్​ ట్విట్టర్​ ఉద్యోగులను కోరినట్లు సమాచారం. ఉద్యోగులతో ఇటీవల జరిగిన సమావేశంలో మస్క్ మాట్లాడుతూ .. టెక్నాలజీ స్టాక్‌లోని కీలకమైన విభాగాలను మొదటి నుంచి పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఇంజనీరింగ్ బృందాలను ఒక్కతాటిపైకి తెచ్చి వికేంద్రీకరణ చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నాడు.

Editor