Latest Posts

ప్రధానితో భేటీ తరువాత పవన్ రాజకీయ వ్యూహం స్పష్టమైన మార్పు

పవన్ రాజకీయ వ్యూహం మార్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తనకు ఒక ,చాన్సివ్వాలని ప్రజలను కోరుతున్నారు. వైసీపీకి తానే ప్రత్యామ్నాయమని ఆయన భావిస్తున్నారు. జనసేన మాదిరిగా వైసీపీని ఎదుర్కొవడంలో టీడీపీ ఫెయిలైందని కూడా చెబుతున్నారు. అందుకే వైసీపీని గట్టిగా ఎదుర్కొంటామని.. అన్నిచోట్ల అభ్యర్థులను రంగంలోకి దించుతామంటున్నారు. నిన్నటి వరకూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత ఓటును చీలిపోనివ్వనని చెప్పుకోవడం ద్వారా పొత్తు సంకేతాలిచ్చిన పవన్.. ప్రధానితో భేటీ తరువాత స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అప్పట్లో చేసిన ప్రకటనలకు విరుద్ధంగా ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. ఇవి పొలిటికల్ సర్కిల్ లో కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. అటు ప్రధాని మోదీపై పవన్ సోషల్ మీడియా వేదికగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

YES9 TV