ఫిట్నెస్ విషయంలో ఎప్పుడూ ముందుండే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తాజాగా షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు, నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ 35వ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో కార్తికేయతో కలిసి ఉన్న ఒక ఫోటోను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఫోటోలో మహేష్ బాబు శరీరాకృతిలో వచ్చిన అనూహ్య మార్పును చూసి అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఆ ఫోటోలో మహేష్ బాబు లూజ్ టీ-షర్ట్, ప్యాంట్ ధరించి ఒక కుర్చీలో కూర్చుని కార్తికేయతో లోతైన చర్చలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే మహేష్ కాళ్లు చాలా సన్నగా, బక్కచిక్కిపోయి కనిపించడంతో పాటు చేతులపై నరాలు స్పష్టంగా బయటకు తేలి ఉండటంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. డైట్ పేరుతో అన్నం తినడం పూర్తిగా మానేశారా?, మరీ ఇంత సన్నగా అస్థిపంజరంలా మారిపోయారేంటి? అంటూ విమర్శలు గుప్పిస్తుండగా, మరికొందరు రాజమౌళి తన సినిమాల కోసం హీరోలను ఎంతగా మార్చేస్తారో ఈ ఫోటో చూస్తే అర్థమవుతోందంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
మరోవైపు తమ అభిమాన హీరోను ఇలా బక్కచిక్కిన రూపంలో చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన చెందుతూ, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ ఇంతలా బరువు తగ్గాల్సిన అవసరం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “అన్నా.. దయచేసి కొంచెం అన్నం తినండి, మళ్లీ మునుపటిలా హెల్తీగా మారండి” అంటూ అభిమానులు ఎమోషనల్ కామెంట్లు పెడుతున్నారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలోని ద్విపాత్రాభినయంలో భాగంగా, ఒక ప్రత్యేక పాత్ర కోసమే మహేష్ ఇంత కఠినమైన డైట్ చేసి ఈ లుక్‌లోకి మారారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
