Latest Posts

సోనియా గాంధీకి సావర్కర్ మనవడి లీగల్ నోటీసులు.. ఆత్మకథలో చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ క్షమాపణకు డిమాండ్!

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ (వీడీ సావర్కర్) మనవడు సత్యకీ సావర్కర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పుస్తకంలో సావర్కర్ చరిత్రను వక్రీకరించి పేర్కొన్నారని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆ పుస్తకంలోని 201 మరియు 443 పేజీలలో పొందుపరిచిన అంశాలు పూర్తిగా వాస్తవ విరుద్ధమైనవని, చారిత్రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని సత్యకీ తన నోటీసుల్లో ఆరోపించారు.

స్వాతంత్ర్య సమరయోధుడు వీడీ సావర్కర్ ప్రతిష్టకు, ఆయన వారసత్వానికి తీవ్ర హాని కలిగించేలా ఆ పుస్తకంలో రాతలు ఉన్నాయని సత్యకీ సావర్కర్ మండిపడ్డారు. తక్షణమే ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై సోనియా గాంధీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసుల ద్వారా డిమాండ్ చేశారు.

అంతేకాకుండా పుస్తకంలో ప్రచురించిన ఆ తప్పుడు సమాచారాన్ని వెంటనే సరిదిద్దాలని, లేనిపక్షంలో తీవ్రమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సత్యకీ సావర్కర్ స్పష్టం చేశారు. ఈ పరిణామంతో సావర్కర్ వ్యాఖ్యల వివాదం మరోసారి జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Editor