Latest Posts

జిల్లా ప్రజా సమస్యల పరిష్కారంలో గురు తన బాధ్యత గా వ్యవహరిస్తా..

జిల్లా ప్రజా సమస్యల పరిష్కారంలో గురు తన బాధ్యత గా వ్యవహరిస్తా..
– శ్రీ సత్యసాయి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గా ఎన్నికైన సునేత్ర కు సన్మానం
హిందూపురం:

సత్యసాయి జిల్లా జడ్పీహెచ్ చైర్మన్ గా ఎన్నికైన సునేత్ర కు
శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీ కార్యాలయంలో సత్యసాయి జిల్లా పార్లమెంట్ జనసేన పార్టీ జిల్లా సమన్వయకర్త నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నవీన్ నిచ్చల్ మాట్లాడుతూ
సత్య సాయి జిల్లాలో మొట్టమొదటి సారిగా జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ స్థానాన్ని మహిళకు కేటాయించడం సంతోషమన్నారు. చిన్న వయసు సునేత్రకు గురుతర బాధ్యతలు అప్పగించడం చరిత్రలోనే మొదటిసారి అన్నారు. ఇందుకు కృషి చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు అన్నారు. కూటమి పార్టీలో భాగంగా టిడిపి జనసేన బిజెపి నాయకులను కలుపుకుని ముందుకు పోతామన్నారు. అహర్నిశలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యలను పరిష్కారంలో చొరవ చూపి జిల్లాకు పార్టీకి మంచి పేరు తేవాలని జడ్పీ వైస్ చైర్మన్ ను కోరారు.
బైట్:

జెడ్పీ వైస్ చైర్మన్ సునేత్ర మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పార్లమెంట్ సమన్వయకర్త నవీన్ నిచ్చల్ కు సందర్భంగా సునేత్ర కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే పార్టీ ఆశయాలకు ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు గురుతర బాధ్యత గా కృషి చేస్తా నని అన్నారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు సునేత్ర దంపతులకు శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor