- కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తాం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం: జడ్పీటీసీ అభ్యర్థి బోయ వన్నూరస్వామి
డి. హీరేహాల్ నవంబర్ 3 YES 9 TV News
కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలిపి ఆశీర్వదిస్తే మండలాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని డి. హీరేహాల్ మండల జడ్పీటీసీ అభ్యర్థి బోయ వన్నూరస్వామి పేర్కొన్నారు. మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని వెల్లడించారు.
జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు కమలం గుర్తుపై ఓటు వేసి ఆదరించాలని ఓటర్లను కోరారు. అదే విధంగా మండలవ్యాప్తంగా వివిధ స్థానాల్లో పోటీ చేస్తున్న కూటమి బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థులకు కూడా ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సమన్వయం అవసరమని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చని అన్నారు. ప్రజల ఆశీస్సులతో తనకు అవకాశం కల్పించాలని, ఎన్నికల్లో మద్దతు తెలిపి ఆదరించాలని బోయ వన్నూరస్వామి కోరారు.
