- దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో గోరవయ్యల సందడి
- మూడో ప్రయత్నంలో ఇనుప గొలుసు తెంపిన గాదిలింగప్ప
కర్నూలు జిల్లా దేవరగట్టులో శ్రీ మాళ మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా గోరవయ్యలు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డమరుకాల మోతలు, గోరవయ్యల నృత్యాలతో దేవరగట్టు పరిసరాలు మారుమోగాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన ఇనుప గొలుసు తెంపే కార్యక్రమం ఉత్కంఠను రేకెత్తించింది. గోరవయ్య గాదిలింగప్ప మూడు ప్రయత్నాల అనంతరం ఇనుప గొలుసును తెంపాడు. ఈ ఘట్టాన్ని భక్తులు ఆసక్తిగా వీక్షించారు. మాళ మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాల్లో తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయ కార్యక్రమాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇలాంటి ఆవాంచీయ సంఘటనలు జరుగుకూడా బందోబస్తు ఏర్పాటుచేసిన పోలీసులు..
