‘ శ్రీ సత్యసాయి జిల్లా రాజకీయాల్లో జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. కొత్తగా ఏర్పడిన సత్యసాయి జిల్లా తొలి జెడ్పీ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కూటమిలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి ఇద్దరు కీలక నేతలు బరిలోకి దిగడంతో జిల్లా పరిషత్ పీఠం ఎవరికి దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ అంశంపై మా ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధిప్రతినిధి వీర శేఖర్ రెడ్డి అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఒకవైపు టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్… మరోవైపు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల రీ-షెడ్యూల్ ప్రకారం, శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది నవంబర్ 2026 లో జరిగే ఎన్నికల ఫలితాల అనంతరం స్పష్టమవనుంది.
శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ జిల్లా పరిషత్ (జనరల్ కేటగిరీ) ఎన్నికల్లో, జడ్పీటీసీ స్థానాల బలాబలాలు, కూటమి అంతర్గత సమీకరణాలు మరియు నవంబర్ 3న వెలువడే ఫలితాలే తొలి జడ్పీ పీఠం ఎవరిదనేది డిసైడ్ చేయనున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్న తరుణంలో ఈ అంశం మరోసారి చర్చకు దారి తీసింది. ఇరు పార్టీల అభ్యర్థులు గెలిచి చైర్మన్ పీఠం కోసం పట్టుపడితే ఇరు పార్టీల అధినాయకత్వానికి చైర్మన్ ఎవరన్నది డిసైడ్ చేయడం తలనొప్పిగా మారడం ఖాయం.
కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు, పుట్టపర్తి నామినేషన్ల ర్యాలీలు, పరిటాల శ్రీరామ్ అనుచరులతో వెళ్తున్న దృశ్యాలు, చిలకం మధుసూధన్ రెడ్డి నామినేషన్ వేస్తున్న దృశ్యాలు)
