అనంతపురం జిల్లా పామిడిలో వైసీపీ నేత కత్రిమల చెన్నకేశవరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆయన నామినేషన్ల ప్రక్రియలో పాల్గొనేందుకు వెళ్తారనే ముందస్తు సమాచారంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న చెన్నకేశవరెడ్డిని ఆయన నివాసంలోనే పోలీసులు నిర్బంధించారు. ఈ పరిణామంతో పామిడిలో రాజకీయంగా చర్చ మొదలైంది.
