నవంబర్, డిసెంబర్‌లో బాక్సాఫీస్ వార్.. యంగ్ హీరోల మధ్య హోరాహోరీ పోటీ!

2026 చివరి రెండు నెలల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అసలైన సందడి మొదలుకానుంది. యంగ్ హీరోలంతా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లతో బాక్సాఫీస్ వద్ద పోటీ పెరగనుండగా, ఈ సినిమాల్లో ఏవి బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా తమ కెరీర్‌లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోలకు ఈ చిత్రాలు కీలకంగా మారనున్నాయి.

నవంబర్ 12న శర్వానంద్ నటిస్తున్న ‘భోగి’ సినిమాతో బాక్సాఫీస్ సందడి ప్రారంభం కానుంది. దర్శకుడు సంపత్ నంది తెలంగాణ నేపథ్యంలో పవర్‌ఫుల్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత నవంబర్ 19న యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ సినిమాతో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సీక్వెల్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఇక నవంబర్ 20న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగనున్నారు. వరుసగా మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో థియేటర్ల వద్ద పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. ఈ చిత్రాల్లో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునే సినిమా ఏది? భారీ వసూళ్లతో విజేతగా నిలిచే హీరో ఎవరు? అన్నది తెలియాలంటే విడుదలల వరకు వేచి చూడాల్సిందే.

Editor