అనంతపురం జిల్లా
రాయదుర్గం నియోజకవర్గం•••••
*మారెంపల్లిలో రూ.60 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం
*బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే బాధ్యత టీడీపీదే..
*ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు*
గుమ్మగట్ట మండలం మారెంపల్లి గ్రామంలో పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా రూ.60 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో గోకులం షెడ్డు, సీసీ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించారు. అలాగే రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయబడిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ సిద్ధం కావాల్సిందేనని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని తెలిపారు. టీడీపీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రజలు మద్దతు పలకాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కోరారు.
