ఎస్ 9టీవీ న్యూస్
కూడేరు అక్టోబర్ 8
అనంతపురం జిల్లా ఇన్చార్జ్
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం పరిధిలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్థిక మంత్రి నియోజకవర్గం.
పిల్లి తన పిల్లలను కాపాడుకోవడానికి ఒకచోట నుంచి మరో చోటుకి స్థలం మార్చే పద్దతిని గమనించాం అదే రీతిలో నిఘా వర్గాల దానిని తప్పించుకోవడానికి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పేకాట శిబిరం తరలిస్తున్న వైనం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈత తంగం ఎక్కడో కాదు జిల్లా కేంద్రానికి కూతవీటి దూరంలో అరువుకూరు అటవీ ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ నిత్యం లక్షల్లో పేకాట జరుగుతుంది. పేకాట నిర్వహిస్తున్న జూదరులు లక్షలాది రూపాయలు జేబులో వేసుకుంటున్నారు పేకాట వ్యసనానికి బానిసైనా జూదర్లు మాత్రం తమ జేబులను గుల్ల చేసుకుంటున్నారు.
అరవకూరు ఆగిలో..
వ్యవహారిక భాషలో అరవకూరు ఆగి అంటే తెలియని వారు లేరు. వందలాది ఎకరాలలో విస్తరించిన ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆరుగురు కమ్మూరు, ముకుందాపురం, ఇప్పేరు, కలగళ్ల, పెనగచెర్ల డ్యాం, వరకు ఈ అడవి ప్రాంతం విస్తరించింది ఈ ప్రాంతమే ప్రస్తుతం పేకాట నిర్వాహకులకు స్థావరం అయింది. అరవకూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ శిబిరం కాపలా బాధ్యతలను భుజాన వేసుకున్నట్టు తెలుస్తుంది.కూడేరు మండలంలో పేకాట నిర్వాణకు పేరుగాంచిన చోళ సముద్రం గ్రామానికి ఒక అధికార పార్టీ నాయకుడు ఈ కేంద్రం నిర్వహిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఇదే వ్యక్తి మరి కొందరితో కలిసి గతంలో మరుట్ల, కొరకోడు డ్యాం, చోలసముద్రం, జయపురం, సమీపంలోని పెన్నా నది, పరివాహక ప్రాంతంలో పేకాట నిర్వహించేవారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పత్రికల్లో ప్రచురితమైంది. దీంతో పేకాట నిర్వాణకు కేంద్రాన్ని విడపనకల్లు మండలం ఉండబండకు తరలించారు. అక్కడ జోరుగా పేకాట సాగుతున్న సమయంలో ప్రతిపక్ష నాయకులతో పాటు పత్రికలు విరుచుకు పడటంతో ఆటకు బ్రేక్ పడింది. అప్పటినుంచి కొద్ది రోజులు విరామం తర్వాత తాజాగా అరవకూరుకు మఖా మార్చారు జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి జూదరులు నిత్యం ఇక్కడికి వస్తున్నారు లక్షల్లో పేకాట జరుగుతుంది. ఆడించేవారు ఆడేవారు, వడ్డీలకు, ఇచ్చేవారు, కాపలాకాసేవారు, ఇలా నిత్యం పదుల సంఖ్యలో జనాలు గుమ్మికూడి అడవి ప్రాంతానికి చేరుకుంటున్నారు. నిత్యం కొత్త వ్యక్తులు సంచారంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి న చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
