Latest Posts

నిజాయితీగల జర్నలిజం ఎం అయిపోయింది…..?

*నిజాయితీగల జర్నలిజం ఎం అయిపోయింది…..?

*ప్రజలకి అధికారుల వద్ద న్యాయం.జరకపోతే….ఒకప్పటిల.ప్రశ్నించే జర్నలిజం ఎక్కడ…..?

*ప్రజలకి న్యాయం చేయాల్సిన అధికారులు ప్రజా ప్రతినిధులు లే అన్యాయం చేస్తూ వుంటే …ఎవరిని సంప్రదించాలి…? మాకు దిక్కెవరు…?*.

నిజాయితీ గల అధికారులు లేరు…అంతా డబ్బు మయం….అయితే వీళ్ళని ప్రశ్నించే జర్నలిజం ఎక్కడ…?

ఒకప్పుడు నేను ఒక భారతీయ పౌరుడిని అని చెప్పుకోవడానికి గర్వం గా వుండేది…కానీ ఇప్పుడు ఎటు. చూసిన.అవినీతి ముసుగులో కోట్ల. అవినీతి.. ప్రజా ధనాన్ని జీతాలు గా తీసుకుంటున్న.అధికారులు.. ప్రజలకి సరైనటవంటి సేవలందించక లంచాల మత్తులో..తేలియాడుతూ..ప్రజలకి అనేకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు…

సిగ్గుందా అసలు మీరు తీసుకొనే జీతం మీరు కర్చు చేసే డబ్బులు అంతా ప్రజల.. సొమ్మే.. కాదంటారా…?మనిషి నూటికి 90% కర్చుపెట్టేది…విధ్య ,వైద్యం కోసమే…కాదంటారా….? అందులోనూ అవినీతే…విధ్య, వైద్యం లోనూ కోట్ల రూపాయల ప్రజల వద్ద కొల్లగొడుతున్నారు. కాదంటారా…?ప్రజా.విషయానికి వస్తె మన దౌర్భాగ్యం ఏంటంటే లచ్చా పనులు చేస్తూ కుంభకోణాలు చేస్తూ…భినామీల పేర్ల తో కోట్లు రూపాయల ప్రజా ధనాన్ని ప్రక్క త్రోవ పట్టిస్తున్నారు….?

వీళ్ళు మనకు ..? ప్రజల పట్ల సమాజం పట్ల కనీస అవగాహన లేని ప్రజా మనం.. అధికారులు దగ్గరకు వెళితే ఎవరు మీరు ఏ పంచాయితీ చూద్దాం లే తొందర పడితే పనులవ్వవు నిధులు వుండాలి కదా ఇలాంటివి ప్రజలు వినవల్సిన పరిస్థితి…. వీళ్ళ అయ్య జాగీర ప్రజల సొమ్ముతో విలాస వంతమైన బంగ్లలాలో వుంటు కోట్ల ప్రజల ధనాన్ని ప్రక్క త్రోవ పట్టించి …ప్రజల కి కనీస అవసరాలు.తీర్చలేని. స్థితిలో వున్నారు..ఇక మీడియా విషయానికి…వస్తె ప్రజలకి అధికారులు,ప్రజా ప్రతినిధులు వద్ద న్యాయం జరగకపోతే…నేరు గా మీడియా నీ ప్రజలు సంప్రదిస్తే…కొంత మంది జర్నలిజం ముసుగులో ఉన్న చిడపురుగులు…ప్రజల వద్ద విషయన్ని తెలుసుకొని సంబంధిత అధికారుల తో…ఏకమై ముడుపులకు కక్కుర్తి పడి ప్రజల సమస్యలను ప్రక్క దారి పట్టించి… అధికారులకి వత్తాసు పలుకుతున్నారు….ఇది ఇలా ఉంటే నిజాయితీ గల కొంతమంది విలేకరులు ప్రజల సమస్యలను గుర్తించి ప్రజా. అధికారులకు. ప్రశ్నిస్తే నిజాయితీగా గల విలేకరుల పై దాడి చేయటం,వారి పైన తప్పుడు ఆరోపణలు చేసి కేసులు పెట్టటం,కొంత మందిని హత మార్చటానికి కూడా వెనుకాడటం లేదు….అసలు ఎం జరుగుతుంది…చివరికి మీడియా ద్వారా కూడా మాకు న్యాయం జరిగే సమయానికి వాళ్ళ కలానికి అడ్డుపడుతున్నారు.

ఇదెక్కడి న్యాయం ఇదెక్కడి ప్రజాస్వామ్యం….. ప్రజా సేవ ముసుగులో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన.అధికారులకి ఎదిరించే యువతి యువకులు రావాలి …అవినీతిని అంత మొందించలి..ప్రజలకి న్యాయం చేయాలి …అలాంటి ప్రజలకి నిజాయితీ గల జర్నలిస్ట్ ల సహకారం కావాలి……

నిజాన్ని నిర్భయంగా రాయగలిగే దమ్మున్న వాళ్ళు మాత్రమే జర్నలిజం ఫ్లాట్ ఫామ్ కి రండి..అంతే కానీ అధికారులకి వత్తాసు పలుకుతూ ముడుపులకు కక్కుర్తి పడి వార్తలు రాసేవాళ్ళు దేశ ద్రోహుల తో సమానం ఇప్పటికైనా నైతిక విలువలు పాటించండి…. జర్నలిజాన్ని కాపాడండి.🇮🇳 జైహింద్ జై భారత్🇮🇳 ప్రజలే సుప్రీమ్🇮🇳crpfi🇮🇳 అవినీతి అంతం వైపు మాతో అడుగులు చేయి చేయి కలపండి

Posted Under AP
Editor