అనంతపురం జిల్లా
రాయదుర్గం
పొట్టకూటి కోసం వస్తే..
కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్న మధ్య దళారులు యజమాని…
దళారుల మాయలో మహారాష్ట్ర కూలీలు.
మహారాష్ట్ర లోని రాయగడ్ ప్రాంతానికి చెందిన 98 మంది కార్మికులకు విముక్తి.
రాయదుర్గం నియోజకవర్గంలో రెవెన్యూ, లేబర్, పోలీసు అధికారుల తో కలిసి రెడ్స్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా విస్తృత తనిఖీలు.
బొగ్గు బట్టీల్లో కార్మికుల శ్రమదోపిడీ.. స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు
పొట్టకూటి కోసం మహారాష్ట్ర నుండి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన కూలీలు దళారుల మాయలో చిక్కుకుని వెట్టిచాకిరీ చేస్తున్న ఘటన రాయదుర్గం నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చింది.
నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన 98 మంది బొగ్గుల బట్టీల్లో వెట్టి చాకిరీ చేస్తున్న కార్మికులను అధికారులు విముక్తి కల్పించారు.
మహారాష్ట్రలోని రాయగడ్ ప్రాంతానికి చెందిన పలువురు కార్మికులు ఉపాధి కోసం దళారుల ద్వారా రాయదుర్గం ప్రాంతానికి వచ్చి దళారులు యజమానులు చేతుల్లో బంధీలుగా జీవనాన్ని సాగిస్తున్నారు.
కార్మికుల్లో చాలామంది చిన్నపిల్లలు ఆడవాళ్లు , గర్భవతులు , వృద్ధులు కూడా ఉన్నారు…
వీరి జీవనం దినదిన గండంగా గడుస్తూ ఉంది . ముళ్ళ కంపల్లో పొలాల్లో చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకొని అందులోని వీరంతా దుర్భరమైన జీవనం సాగిస్తున్నారు..
వీరికి సరైన వేతనాలు కూడా ఇవ్వకుండా మాట్లాడిన రేటు కూడా ఇవ్వకుండా ఒక నరకప్రాయమైన జీవితాన్ని వీళ్ళకు సృష్టించారు.
ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులు దళారుల చేతిలో మోసపోకుండా అధికారులు మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. కార్మికుల హక్కులకు భంగం కలిగించే ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రెడ్స్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ భానుజా ప్రజలకు అధికారులకు పిలుపునిచ్చారు…
బాధితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు…
ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 30 వేల రూపాయలు ప్రభుత్వ ధనం వచ్చేలాగా అధికారులు చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు..
98 మంది బాధితులని ఆర్టీసీ బస్సులలో మహారాష్ట్రలోని రాయగడ్ ప్రాంతంలో ఉన్న బాధితుల స్వస్థలాలకు చేరుస్తున్నట్లు ఆమె తెలిపారు..
బైట్స్ :- భానుజా, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్
