భారత స్టాక్ మార్కెట్లలో గురువారం ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించిన పరిణామాలు ప్రభావం చూపాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, ఫెడ్ వడ్డీ రేట్లపై అంచనాల నేపథ్యంలో మార్కెట్లలో ఒడుదొడుకులు కనిపించగా.. ఐఆర్డీఏఐ తీసుకొచ్చిన కొత్త సంస్కరణలు, నిబంధనల ప్రతిపాదనలు కూడా మదుపర్ల దృష్టిని ఆకర్షించాయి.
ఐఆర్డీఏఐ ప్రతిపాదించిన మార్పుల ప్రభావం ఇన్సూరెన్స్ రంగానికి చెందిన పలు కంపెనీల షేర్లపై కనిపించింది. ముఖ్యంగా బీమా రంగానికి సంబంధించిన స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో ఈ రంగానికి చెందిన పలు షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.
మరోవైపు ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పాలసీబజార్ షేర్లపై కూడా ప్రభావం పడింది. గురువారం ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు గణనీయంగా క్షీణించాయి. ఐఆర్డీఏఐ ప్రతిపాదించిన నిబంధనలు అమల్లోకి వస్తే బీమా రంగంలోని కంపెనీల వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశంపై మార్కెట్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.
