Latest Posts

వెస్టిండీస్ సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్.. గాయపడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన బౌన్సర్ నేరుగా గిల్ కుడి మోచేతికి తగలడంతో అతడు తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. నొప్పి కారణంగా వెంటనే నెట్స్ నుంచి బయటకు వెళ్లాడు.

గిల్‌కు గాయం కావడంతో ఫిజియో, వైద్య బృందం వెంటనే స్పందించింది. సుమారు 20 నిమిషాల పాటు అతడిని పరీక్షించి, కుడి మోచేతికి పట్టీ కట్టారు. అనంతరం డగౌట్‌లో విశ్రాంతి తీసుకుంటున్న గిల్‌ను సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ పరామర్శించి, గాయం పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు.

నొప్పి తగ్గిన తర్వాత గిల్ మళ్లీ నెట్స్‌లోకి వచ్చి బ్యాటింగ్ ప్రాక్టీస్ కొనసాగించాడు. దీంతో టీమిండియా శిబిరంలో కొంత ఊరట కనిపించింది. అయితే గాయం తీవ్రత, వన్డే సిరీస్‌లో గిల్ ఆడటంపై స్పష్టత రావాల్సి ఉంది.

Editor