కర్నూలు జిల్లా అస్పరి మండలం బిల్లేకల్లు గ్రామంలోని ఊరుకొండ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత కనిపించడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
పొలాలు, కొండ ప్రాంతాలకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి, ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి చిరుతను పట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
చిరుత సంచారంతో ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
