రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
ముదిగుబ్బ, ప్రజాశక్తి: ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం బస్టాండ్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాళ్ల అనంతపురం తండాకు చెందిన కుల్లాయి నాయక్ (52), తండ్రి తావరే నాయక్, రోడ్డు దాటుతుండగా కదిరి వైపు నుంచి అనంతపురం వైపు వెళ్తున్న తెలుపు రంగు XUV 700 కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కుల్లాయి నాయక్‌కు గాయాలైనట్లు సమాచారం. ఘటనపై ముదిగుబ్బ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.

Posted Under AP
Editor