డీజే మోత.. పోలీసుల మౌనం!

ముదిగుబ్బ : డీజే మోత.. పోలీసుల మౌనం!
ముదిగుబ్బ, ప్రజాశక్తి: వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ముదిగుబ్బలో ఆక్సిఫర్డ్‌ స్కూల్‌ యాజమాన్యం డీజే ఏర్పాటు చేసి ఊరేగింపుగా వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే నిమజ్జన ఊరేగింపుల్లో డీజేకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో డీజే వాహనాన్ని పోలీసులు ముదిగుబ్బ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అనంతరం డీజే లేకుండా ఊరేగింపు నిర్వహించుకోవాలని స్కూల్‌ యాజమాన్యానికి పోలీసులు సూచించారు. ఇదిలా ఉండగా, పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో డీజేలు కొనసాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. డీజేలకు అనుమతి కొంత మందికే ఇస్తున్నారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. నిమజ్జన కార్యక్రమంలో నిబంధనలు అందరికీ సమానంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Posted Under AP
Editor