కర్నూలు జిల్లా,,ఆలూరు మండలం కమ్మరచెడు గ్రామ ఈరోజు 09.09.2026 న సాయంత్రం 7 గంటలకు సమీపంలోని ఆదోని వెళ్లే దారిలో బ్రహ్మయ్యస్వామి దేవాలయం వద్ద అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. అమ్మ ఒడికి చేరాల్సిన పసిబిడ్డను ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలేయడం హృదయాలను కలచివేసింది. విషయం తెలుసుకున్న ఓ మహిళ వెంటనే శిశువును తన ఇంటికి తీసుకెళ్లి మానవత్వం చాటుకుంది. కన్నబిడ్డను కాదనుకున్న వారి హృదయాలు రాయిగా మారాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
కలచివేసిన కర్నూలు ఘటన: రోడ్డుపక్కన అప్పుడే పుట్టిన పసికందును వదిలేసిన వైనం.. ఇంటికి తీసుకెళ్లి ప్రాణం పోసిన మహిళ!
