- అనంతపురం జిల్లా
రాయదుర్గం నియోజకవర్గం••••• - ప్రేమకు హద్దులు లేవు.. హిజ్రాను పెళ్లాడిన యువకుడు
- కుటుంబ సభ్యుల అంగీకరించకపోవడంతో… హిజ్రా కమ్యూనిటీ ఆధ్వర్యంలో వివాహం
- కనేకల్ నాగుల కట్ట వద్ద సాంప్రదాయబద్ధంగా పెళ్లి…..సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
*
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లో ఓ విభిన్న వివాహం చర్చనీయాంశంగా మారింది. కనేకల్కు చెందిన హిజ్రా జాను, డి.హిరేహాళ్ మండలం గొడిసలపల్లికి చెందిన వంశీ అనే యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్నారు.
గత మూడేళ్లుగా జాను, వంశీ ప్రేమించుకుంటున్నప్పటికీ . తమ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించకపోవడంతో హిజ్రా కమ్యూనిటీ సభ్యులు ముందుకు వచ్చారు. బుధవారం కనేకల్లోని నాగులకట్ట వద్ద వారి ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా వివాహ వేడుక నిర్వహించారు.
ముందుగా నాగులకట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం మాంగల్యధారణతో వివాహ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా హిజ్రా కమ్యూనిటీకి చెందిన పలువురు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. జీవితాంతం ఈ జంటకు అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు.
కుటుంబ సభ్యుల నుంచి అంగీకారం లేకపోయినా తమ ప్రేమకు కట్టుబడి వివాహం చేసుకున్న ఈ జంటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఈ విభిన్న వివాహం కనేకల్ పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.
