Latest Posts

కర్నూలు జిల్లా ఆలూరు మండలo ఆలూరు కేంద్రంలో సోమవారం వైభవంగా జరిగిన శ్రీ సిద్ధేశ్వర స్వామి రథోత్సవంలో ఒక విలేకరి పర్స్ చోరీకి గురైంది.  

కవరేజ్ కోసం వెళ్లిన విలేకరి పర్స్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఆ పర్సులో విలేకరికి సంబంధించిన ప్రెస్ అక్రిడిటేషన్ కార్డ్, వివిధ బ్యాంక్ ఏటీఎం కార్డ్‌లు మరియు కొంత నగదు ఉన్నాయి. దొంగలు పర్సులోని నగదును మాత్రం తీసుకుని, కార్డ్‌లు ఉన్న పర్స్‌ను అక్కడే పడేసి వెళ్లిపోయారు.

అక్కడ ఉన్న స్థానిక ప్రజలు పడేసిన పర్సును గమనించి, వెంటనే పోలీసులకు అందజేశారు. పోలీసులు ఆ పర్సులోని అక్రిడిటేషన్ కార్డ్ ఆధారంగా సదరు విలేకరిని గుర్తించి, దాన్ని భద్రంగా ఆయనకు అప్పగించారు.

తమ కార్డులు సురక్షితంగా తిరిగి దక్కేలా వేగంగా స్పందించిన పోలీసులు మరియు పర్సును అందించిన స్థానిక ప్రజలకు సదరు విలేకరితో పాటు స్థానిక పత్రికా విలేకరుల సంఘం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

Posted Under AP
Editor