ముదిగుబ్బ: మండలంలోని దొరిగల్లు రెవెన్యూ పొలంలో షేక్ ఫక్రుద్దీన్‌కు చెందిన సర్వే నంబర్ 2033-1లోని 3.80 సెంట్ల పొలానికి గత నాలుగేళ్లుగా ఉన్న రస్తా సమస్యను తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. పక్కనే ఉన్న సర్వే నంబర్లు 2033-2, 2033-3 పొలాలను పరిశీలించి, వెంటనే స్పందించి శాశ్వత రస్తా పరిష్కారం కల్పించారు.
రస్తా సమస్యను పరిష్కరించిన తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డి, సర్వేయర్ ధనుంజయ, రెవెన్యూ సిబ్బందికి ముదిగుబ్బ మండల సీపీఎం, సీఐటీయూ, ఆవాజ్ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న, సీఐటీయూ మండల కార్యదర్శి బాబ్జాన్, ఆవాజ్ గౌరవ అధ్యక్షులు ఫక్రుద్దీన్, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు.
