ఉరవకొండ:
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో క్షుద్ర పూజల ఘటన తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఓ ఇంట్లో గృహప్రవేశం జరగకముందే గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజలు నిర్వహించారు.
ఉదయం ఇంటి వద్ద బొగ్గుతో వేసిన ముగ్గులు, పసుపు, కుంకుమతో పాటు రక్తపు మరకలు, వెలుగుతున్న దీపం కనిపించడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టకముందే ఇలాంటి క్షుద్ర చేష్టలకు పాల్పడటంతో ఇంటి యజమాని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాత కక్షలు లేదా మూఢనమ్మకాలతోనే ఈ చర్యకు ఒడిగట్టి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
