కుందుర్పి పాఠశాల ఆవరణలో వ్యక్తి సూసైడ్

 

కుందుర్పి మండలం బేస్తరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణ చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని వెంకటస్వామి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మడకశిర మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామి బేస్తర పల్లిలో వివాహం చేసుకొని ఇక్కడే నివసిస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. పాఠశాల ఆవరణలో ఆత్మహత్య చేసుకోవడంతో విద్యాశాఖ అధికారులు పాఠశాలకు సెలవు ప్రకటించారు.

Posted Under AP
yes9tv