అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుకు అడ్డంగా వచ్చిన అడవి పందిని తప్పించబోయి వాహనం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కళ్యాణదుర్గం నుంచి కర్ణాటకలోని కడూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బ్రాహ్మణపల్లి వద్ద అకస్మాత్తుగా అడవి పంది రోడ్డుపైకి రావడంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన లలితా టెక్స్‌టైల్స్ బెళుగుప్ప నాగరాజు (55), టీచర్ గుప్తా రాఘవేంద్ర (45) మృతి చెందారు. అదే వాహనంలో ఉన్న టీచర్ బలిజ నరహరి, కోమటి హర్ష తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.తమ ఇళ్లకు అవసరమైన కలపను చూసేందుకు వీరంతా కడూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. ప్రమాదంపై బెళుగుప్ప పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ATP KLD ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి 270826
