బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
అనంతపురం జిల్లా బళ్లారి నుంచి కళ్యాణదుర్గం తిరిగి వస్తుండగా బ్రాహ్మణపల్లి వద్ద కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కోమటి నాగరాజు (55), కోమటి గుప్తా (45) అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న బలిజ నరహరి, కోమటి హర్షకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ప్రమాదంపై బెలుగుప్ప పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
