కర్నూలు జిల్లా ఆలూరువిలేకరులకు వివాహ ఆహ్వానం పలికిన గుమ్మనూరు జయరాం..

ఆలూరు న్యూస్:-

ఆలూరు నియోజకవర్గ మాజీ మంత్రి, ప్రస్తుతం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గానికి చెందిన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులందరికీ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలను అందజేసి వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలేకరులను ఉద్దేశించి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవడంలో పాత్రికేయుల సేవలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. సమాజం కోసం నిత్యం కృషి చేస్తున్న మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తన కుమార్తె వివాహానికి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.

Posted Under AP
Editor