రైల్వే గేట్ల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలి
ముదిగుబ్బ: ముదిగుబ్బ–కదిరి 42వ రైల్వే గేట్‌తో పాటు ముదిగుబ్బ–పుట్టపర్తి ఆర్అండ్బీ రోడ్డులోని రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరుతూ నేషనల్ హైవే ప్రాంతీయ అధికారి కేశక్రాంత సింగ్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైల్వే గేట్ల వద్ద ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు వెంటనే పరిష్కరించాలని, మండల ప్రజలు, గ్రామస్తులకు సౌకర్యాలు కల్పించేలా ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు కార్యదర్శి భాషను రమేష్‌బాబు, వేలూరు సూర్యనారాయణ, పసుపులేటి వెంకటేష్, శివకుమార్, దేసునారాయణ, నాగభూషణ, లక్ష్మీనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.
రైల్వే గేట్ల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలి…
