సారంపల్లి మల్లారెడ్డికి సంతాప సభ

ముదిగుబ్బ: సారంపల్లి మల్లారెడ్డి మృతికి సంతాపంగా ముదిగుబ్బ సీపీఎం కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. హరి, జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, ముదిగుబ్బ సీపీఎం మండల కార్యదర్శి పెద్దన్న, సీఐటీయూ మండల కార్యదర్శి బాబ్జాన్, ముస్తఫా, నౌషాద్, రహీమ్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ మల్లారెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. అనంతరం మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Posted Under AP
Editor